అతివేగం, నిర్ల‌క్ష్యం వంటి కార‌ణాల‌తో రోజు రోజుకు రోడ్డు ప్ర‌మాదాలు విచ్ఛ‌ల‌విడిగా విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా  ఉన్న‌తాధికారులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నా నిత్యం ఏదో ఒక చోట ప్ర‌మాదాలు మాత్రం సంభ‌విస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నిర్ల‌క్ష్యంగా వాహ‌నం న‌డ‌ప‌డం, మ‌ద్యం సేవించి, ఓవ‌ర్ టెక్, అతివేగం లాంటి ప‌లు కార‌ణాల‌తో రోడ్డు ప్ర‌మాదాలు త‌రుచూ చోటుచేసుకోవ‌డంతో అమాయక ప్ర‌జ‌ల ప్రాణాలు గాలిలోనే క‌లిసిపోతున్నాయి.

తాజాగా క‌రీంన‌గ‌ర్‌లో ఓ ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. మాన‌కొండూరులో కారు చెట్టును ఢీ కొట్టిన‌ది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. అదేవిధంగా ఒక‌రికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని సహాచ‌క చ‌ర్య‌లు అందించారు. మృతి చెందిన వారంద‌రూ క‌రీంన‌గ‌ర్ జిల్లా వాసులుగా గుర్తించారు. వీరు కారులో ఖ‌మ్మం వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ది. కేసు న‌మోదు చేసుకున్న మాన‌కొండూరు పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: