ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు తన ఔదర్యాన్ని చాటుకుంటూ ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్లోని అనంత‌పురం  జిల్లా గుత్తి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మారుతి ప్రసాద్ అభాగ్యురాలు పట్ల దాతృత్వాన్ని చాటుకున్నారు.  ఆయన చేసిన పనికి ఇప్పుడు అంద‌రితో శ‌బాష్  అని అనిపించుకున్నాడు.  ఏకంగా డీజీపీ  గౌతమ్ సవాంగ్ సైతం ఈయ‌న చూపిన ధాతృత్వానికి  ఫిదా అయిపోయారు.

 పోలీస్ శాఖ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేయ‌గా.. తాజాగా ప్రజలందరూ కానిస్టేబుల్ మారుతి ప్రసాద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రోజు మాదిరిగానే యధావిధిగా డ్యూటీ కి వెళ్ళిన మారుతి ప్రసాద్ రోడ్డు మీదకు రాగానే చలికి గజగజ వణుకుతూ ఓ అభాగ్యురాలు కనిపించినది.  దీంతో అది చూసి చలించిపోయాడు ఆ కానిస్టేబుల్. అత‌ను వేసుకున్న షెట‌ర్ విప్పి  ఆమెకు తొడిగాడు. ఆ తర్వాత ఆమె అనంతపురంలోని ఓ అనాధాశ్రమంలో చేర్పించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానవత్వం ప్రదర్శించిన కానిస్టేబుల్ అంటూ పలువురు కామెంట్లు కూడా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: