తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రగ్స్ విషయంపై దృష్టి సారించారు. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న డ్రగ్‌ కల్చర్‌ను అణిచివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. డ్రగ్స్ అంశంపై చర్చించేందుకు రేపు సీఎం కేసీఆర్ స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో డ్రగ్స్ నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష జరపనున్నారు.


కేసీఆర్ అధ్యక్షత జరగనున్న ఈ సమావేశంలో హోంమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి పాల్గొంటారు. వీరితో పాటు సీఎస్, డీజీపీ, డీజీలు, ఎస్పీలు, సీపీలు కూడా పాల్గొంటారు. సంబంధింత శాఖకు చెందిన ఎక్సైజ్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. డ్రగ్స్ నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణపై సదస్సులో చర్చిస్తారు. డ్రగ్స్ నివారణ విధివిధానాలపై సీఎం, అధికారులు చర్చించి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. తెలంగాణలో డ్రగ్స్ ఇంటింటి వ్యవహారంగా మారిపోయిందని ఇటీవల పోలీసు ఉన్నతాధికారులే వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: