ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం ప్రారంభించడంతో నిన్న స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసిన సంగతి తెలిసిందే.. సెన్సెక్స్ ఏకంగా 2700 పాయింట్లు నష్టపోయింది. దీంతో లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయంది. అయితే ఒక్కరోజులోనే స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. అదే దూకుడు కొనసాగిస్తునత్నాయి. ప్రారంభంలోనే వెయ్యి పాయింట్ల వరకూ లాభపడిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 1400 పాయింట్ల వరకూ లాభపడింది.


అయితే.. ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నా.. స్టాక్‌ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగడం కాస్త ఆశ్చర్యపరిచే పరిణామమే.. సాధారణంగా యుద్ధ ప్రభావంతో కొన్ని రోజుల వరకూ స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు తప్పవనే అంతా అనుకున్నారు. కానీ ఒక్క రోజులోనే మార్కెట్లు కోలుకోవడం సంతోషించదగిన పరిణామమే. రష్యా యుద్ధం ప్రకటించినా మిగిలిన దేశాలు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇది ప్రపంచ యుద్దంగా మారే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే స్టాక్‌ మార్కెట్లలో దీమా కనిపిస్తుందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: