ఉక్రెయిన్‌ పై జరుపుతున్న దాడుల్లో రష్యా తన దేశానికి చెందిన ఓ జర్నలిస్టును కోల్పోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన దాడిలో రష్యా మహిళా జర్నలిస్టు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి. కీవ్‌పై రాకెట్ దాడుల్లో రష్యాకు చెందిన ఓ మహిళా పాత్రికేయురాలు చనిపోయినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. అలాగే ఖార్కివ్‌ పరిపాలనా భవనం శిథిలాల నుంచి మరో 24 మృతదేహాలను బయటికి తీసినట్లు ఉక్రెయిన్ సహాయ బృందాలు చెబుతున్నాయి. ఈనెల ఒకటిన రష్యా సేనలు జరిపిన రాకెట్‌ దాడుల్లో ఖార్కివ్‌ పరిపాలనా భవనం ధ్వంసమైంది. ట్రాస్టియనెట్స్‌ నగరంలో 2రోజులక్రితం భారీ అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇంకా మంటలు ఎగసిపడుతున్నాయి. రాకెట్‌ దాడులు, భీకర పోరు వల్ల సహాయ బృందాలు ఘటనా స్థలానికి వెళ్లలేకపోతున్నాయి. మరోవైపు రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల కొరడా ఝుళిపిస్తూనే ఉన్నాయి. మరికొందరు రష్యన్లపై ఆంక్షలు విధించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: