బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ ఇవాళ ఇండియాకు రానున్నారు. ఆయన రెండు రోజుల పాటు భారత్‌ లో పర్యటించనున్నారు. ఆయన నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. అహ్మదాబాద్‌లో పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ సమావేశం అవుతున్నారు. భారత్, బ్రిటన్ వాణిజ్య, ప్రజా సంబంధాలపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ చర్చిస్తారు. భారత్, బ్రిటన్ పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పని చేయడంపై బోరిస్‌ ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. రేపు దిల్లీలో ప్రధాని మోదీతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ భేటీ అవుతారు. ఇండియా, బ్రిటన్ వ్యూహాత్మక రక్షణ, ద్వైపాక్షిక, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరు నేతల చర్చించే అవకాశం ఉంది. మరి ఈ పర్యటన ఎంత వరకూ ఫలితాన్నిస్తుందో..?  

మరింత సమాచారం తెలుసుకోండి: