టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో టర్నింగ్ పాయింట్ సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పోకిరి సినిమా మాత్రం ఒక సంచలనం అని చెప్పవచ్చు. అప్పటివరకు ఉండే ఇండస్ట్రీలో రికార్డులన్నీ కూడా తిరగరాసింది. మహేష్ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన సినిమా పోకిరి అని ఇప్పటికే అభిమానులతో పాటు మహేష్ బాబు కూడా ఎన్నోసార్లు తెలియజేశారు. తాజాగా ఒక హాలీవుడ్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తాను నటిస్తున్న సినిమా గురించి పోకిరి సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.


హాలీవుడ్ మీడియాలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.. పోకిరి చిత్రం నా జీవితంలో ప్రతిదీ మార్చేసిందని ఆ సినిమా నన్నే ఒక్క రాత్రిలోనే స్టార్డమ్ తీసుకువచ్చేలా చేయడమే కాకుండా నాపై ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి చేర్చిందని, ఆ తర్వాత అలాంటి అంచనాలను అందుకోవడానికి ఏం చేయాలి? ఎలా ముందుకు వేయాలి? అనేది తన ముందు ఉన్న ఒక పెద్ద సవాల్ గా మారిందని తెలిపారు. పోకిరి సినిమా ఇచ్చిన కిక్కు తో పాటు బాధ్యత కూడా పెరిగిందని తెలిపారు.


ఆ తర్వాత ఆడియన్స్ కి ఎలాంటి సినిమా చేస్తే నచ్చుతుందా? అనే టెన్షన్ కూడా ఉండేది. మళ్లీ ఇప్పుడు చాలాకాలం తర్వాత వారణాసి సినిమాలో కూడా అదే టెన్షన్ ఉంది. పోకిరి సినిమాలో ఎలాంటి ఎక్సైజ్మెంట్ ఉందో ఇప్పుడు వారణాసి సినిమాలో కూడా అదే కనిపిస్తోంది. కేవలం ఇది ఒక సినిమా మాత్రమే కాదు అంతకుమించి ఉంటుంది, ప్రేక్షకుల అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తనకి బాగా తెలుసని, ఆ అంచనాలను కచ్చితంగా మించిపోతుందనే ధీమా మాకు కనిపిస్తోందని తెలిపారు మహేష్ బాబు. పోకిరి సినిమా ఎలాగైతే తెలుగు సినిమా స్థాయిని పెంచిందో వారణాసి సినిమా కూడా  ఇండియన్ స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కిస్తుందని అభిమానులు  సైతం కామెంట్స్  చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: