కరోనా సమయంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. నిర్ణీత గడువులోగా ఇవ్వాలని రాష్ట్రాలను అదేశించింది. దీని ప్రకారం రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీలో కొవిడ్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ ఈనెల 25లోగా పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. అ తర్వాత వచ్చే బిల్లుల విషయంలో సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.


ఏ ఒక్క ప్రభుత్వాసుపత్రి లోనూ మందుల కొరత అనేది రాకూడదన్న ప్రభుత్వం.. మందుల కొనుగోలుకు రూ.650 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపింది. మందుల కొనుగోలుకు బడ్జెట్ కొరత లేదని.. స్థానికంగా మందుల కొనుగోలుకు కూడా ఒకేవిధమైన టెండర్ ప్రక్రియను తీసుకొస్తున్నామని తెలిపింది. బిల్లుల చెల్లింపు విషయంలో  మాత్రం కేంద్రీకృత పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.  ప్రభుత్వాసుపత్రుల్లో సిసి కెమెరాలు , బయోమెట్రిక్ హాజరు పరికరాలు సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: