ఆంధ్రాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కలకలం సృష్టిస్తోంది. అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏపీలో క్యాడరే లేదు.. నాయకులే లేరు.. అన్నది ఇన్నాళ్లూ ఉన్న అభిప్రాయం. కానీ.. నిన్న విజయనగరంలో ఆ పార్టీ నిర్వహించిన ర్యాలీ చూస్తే అంతా అవాక్కయ్యారు. విజయనగరం వంటి చోట్ల ఈ స్థాయి ర్యాలీ ఏంటి అని ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అవసరం ఏర్పడిందని, ప్రజల జీవితాలను బాగుచేసే పార్టీలు లేకపోవడమే అందుకు కారణమని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ఆర్. మణినాయుడు అంటున్నారు. ఆయన విజనయగరం జిల్లా పర్యటనలో భాగంగా కోట నుంచి కలెక్టరెట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ జంక్షన్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ కల్యాణ మండపం లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజల పక్షాన పనిచేసే పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రజల మన్ననలను పొందుతుందంటున్నారు ఆప్ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: