తెలుగు దేశం పార్టీ.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని కలలు కంటోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీలోని కొందరు నేతలు చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నారు. అలాంటి వారిలో  టీడీపీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఒకరు. ఈమె చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నారు. ఎప్పటి కప్పుడు ప్రభుత్వం తీరును విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రాజకీయంగా ఏమాత్రం అవకాశం దొరికినా వైసీపీని ఎండగడుతున్నారు.


గతంలో పార్టీ నుంచి మంత్రి పదవులు పొందిన టీడీపీ నాయకురాళ్లలో ఇప్పుడు చాలా మంది పత్తా లేరు. చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించినా పీతల సుజాత వంటి వారు ఇప్పుడు బూతద్దం వేసి చూసినా కనిపించడం లేదు.


కానీ అనిత మాత్రం తరచూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ పార్టీ కోసం కష్టపడుతున్నారు. మరి ఆమె కష్టాన్ని చంద్రబాబు గుర్తిస్తారా? మళ్లీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తారా.. చూద్దాం.. ఏం జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: