ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి ఉత్పత్తిలో దేశంలోనే రికార్డు సాధించింది. 2020-21 ఏడాదిలో దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ధాన్యం విలువ 3 లక్ష కోట్ల రూపాయలు అయితే.. అందులో మూడో వంతు అంటే.. లక్ష కోట్ల రూపాయల ఉత్పత్తి ఈ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాల వల్లే వచ్చింది. ఈ విషయాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.


ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సాధించిన ఈ రికార్డును దృష్టిలో ఉంచుకుని జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సాంబామసూరి, స్వర్ణ వరి రకాలను రూపొందించిన శాస్త్రవేత్తల పేరిట ప్రత్యేక అవార్డులను అందజేస్తున్నారు. వేరు శనగ దేశవ్యాప్త విస్తీర్ణంలోనూ ఆంగ్రూ రకాలు 60శాతం పైగా సాగులో ఉన్నాయి. జూన్ 12వ తేదీన గుంటూరు లామ్ ఫామ్ లోని విశ్వవిద్యాలయంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: