ఏపీ ముఖ్యమంత్రి జగన్ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జగన్‌కు సవాల్‌ విసిరారు. సీఎం జగన్ పుట్టపర్తి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను అవమానించేలా వ్యాఖ్యానించారని నాదెండ్ల మనోహర్  విమర్శించారు. వాళ్లు అసలు రైతులే కాదు అనడం ఆ కుటుంబాలను అవమానించడమే అని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్  జగన్‌కు ఓ సవాల్‌ విసిరారు. తమతో పరామర్శకు వస్తే వాళ్లు రైతులో కాదో చూపిస్తామన్నారు. మేం పరిహారం ఇచ్చిన ఆ కుటుంబాలు ఎన్ని బాధల్లో ఉన్నాయో చూపిస్తామని నాదెండ్ల మనోహర్  అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను అవమానించినందుకు తక్షణమే రాష్ట్ర రైతాంగానికి జగన్ క్షమాపణ చెప్పాలని నాదెండ్ల మనోహర్  డిమాండ్‌ చేశారు. మరి జగన్ క్షమాపణ చెబుతారా?

మరింత సమాచారం తెలుసుకోండి: