భారత్ చైనా మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసిందే. రెండు దేశాలు పరస్పర అనుమానాలతోనే స్నేహం చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మన  పొరుగున ఉన్న భూటాన్ దేశం.. ఇండియాపై చైనా దాడికి సహకరిస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. సిక్కిం వద్ద భూటాన్ సరిహద్దుల్లో చైనా ఇటీవల ఓ గ్రామాన్నే నిర్మించింది. ఇందుకు భూటాన్ కూడా సహకరించిందన్న ఆరోపణలు ఉన్నాయి.


తన దేశ సరిహద్దుల్లోనే చైనా ఓ గ్రామాన్ని నిర్మిస్తున్నా భూటాన్‌ ఇప్పటి వరకూ ఈ ఘటనపై స్పందించడం లేదు. అలాగే.. చైనా నిర్మిస్తున్న గ్రామం గురించి మాట్లాడటం లేదు. ఢిల్లీలోని భూటాన్‌ రాయబారిని జాతీయ మీడియా అడిగితే.. ఆయన బదులిచ్చేందుకు నిరాకరించారు. ఈ ఘటన భారత్‌లో అనుమానం రేపుతోంది. కొంపదీసి భూటాన్ కూడా చైనాకు సహకరిస్తుందేమో అన్న అనుమానాలు మన భద్రతాదళాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే నిజమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మథనం ప్రారంభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: