ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలో సీఎం జగన్  కీలక సంస్కరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చరిత్రాత్మక నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 679 ఎంఈఓ-2 పోస్టులను జగన్ సర్కారు ఇచ్చింది. ఈ పోస్టులను మంజూరు చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాలల నిర్వహణ కోసం ఈ అదనపు ఎంఈవోలను మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.


ఇప్పటి వరకూ ఎంఈవోలుగా విద్యాశాఖ అధికారులే ఉండేవారు.. ఇకపై ఈ ఎంఈవో 2 పోస్టుకు ఉపాధ్యాయులు కూడా అర్హులవుతారు. టీచర్‌గా ఉద్యోగం వచ్చిన వారు.. ఆ తర్వాత హెడ్ మాస్టర్, ప్రిన్స్‌పాల్ స్థాయి వరకే పదోన్నతులు ఉంటాయి. ఇకపై ఎంఈవోగా కూడా వారు పదోన్నతి పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: