ఏపీలోని దిగువ కోర్టుల్లో 3432 ఉద్యోగాల భర్తీకి పరీక్ష తేదీలను వెల్లడిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఎస్‌.కమలాకరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 /జూనియర్‌ అసిస్టెంట్‌ /టైపిస్టు /ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్‌ 21న మూడు విడతలు, 22న మూడు, 23న ఒక విడత, 29న రెండు విడతలు, జనవరి 2న మూడు విడతలు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.

కాపియిస్టు /ఎగ్జామినర్‌ /రికార్డు అసిస్టెంట్‌ పోస్టులకు డిసెంబర్‌ 26న రెండు విడతల్లో ఉమ్మడి పరీక్ష ఉంటుంది.  డ్రైవర్‌ / ప్రాసెస్‌ సర్వర్‌ / ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులకు డిసెంబర్‌ 26న ఒక విడత, 27న మూడు, 28న మూడు విడతలు, 29న 1 విడతలో ఉమ్మడి పరీక్ష ఉంటుంది. డిసెంబర్‌ 16 నుంచి హాల్‌టికెట్లు ఇస్తారు.  హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.. పరీక్ష నిర్వహణ స్థలం, సమయం వివరాలు హాల్‌ టికెట్‌లో  పేర్కొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: