ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ రమేశ్ లను ఇటీవల బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. కొలిజీయం సిఫారసుల మేరకు ఇలా బదిలీలు కావడం సహజంగా జరిగేదే. అయితే.. జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ రమేశ్ బదిలీ సిఫారసులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ బదిలీలను నిరసిస్తూ నిన్న న్యాయవాదులు విధులు బహిష్కరించడం విశేషం.


అంతే కాదు.. నెక్ బ్యాండ్లను తొలగించి కోర్టు ప్రాంగణంలో లాయర్లు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే ప్రజా న్యాయమూర్తులుగా పేరున్న జ‌డ్జీల బదిలీ జరిగిందని లాయర్లు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిష్పక్షపాతంగా తీర్పులిస్తున్నందునే బదిలీ చేయించారని లాయర్లు ఆక్షేపించారు. పేద, అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించిన జడ్జిల ఏకపక్ష బదిలీలపై లాయర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జడ్జీలకు ఇబ్బంది తలెత్తితే బయటకొచ్చి మాట్లాడలేరని.... అందుకే వారి పక్షాన మేం స్పందిస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: