రాష్ట్రంలోని ప్రతీ ఫారెస్టు డివిజన్ లోనూ ఎకోపార్కుల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అధికారులను ఆదేశించారు. ఏపీ సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు, సంస్థల సహకారంతో ఎకో పార్కులను అభివృద్ధి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.


ప్రత్యేకించి అటవీ ప్రాంతంలో మైనింగ్ చేసే సంస్థల సహకారంతో ఎకో పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సోమశిల బ్యాక్ వాటర్ ప్రాంతంలోనూ ఎకో పార్కు నిర్మాణం చేపట్టాల్సిందిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలోని జూ పార్కుల నిర్వహణ కోసం డైరెక్టర్ , క్యూరెటర్ వంటి కీలక పోస్టుల భర్తీ చేపట్టాల్సిందిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విశాఖ, తిరుపతి జంతు ప్రదర్శనశాలల్లో కొత్త జంతువులనూ తీసుకురానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: