శత్రువుల ద్వేషం, సొంత పార్టీలో ఈర్ష్య వంగవీటి రంగా హత్యకు కారణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. విజయవాడలో వంగవీటి మోహనరంగా 34వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. రంగా చిత్రపటానికి మంద కృష్ణ మాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు. కులమతాలకు అతీతంగా పేద పీడిత,బాధిత ప్రజలకు అండగా రంగ నిలిచారని మంద కృష్ణ మాదిగ అన్నారు. సొంత పార్టీలో ఈర్ష్య, శత్రువులు రంగా హత్యకు కారణమని మంద కృష్ణ అన్నారు.


ఆధిపత్య కులాలు, బడుగు బలహీన వర్గాల పోరు మధ్య జరిగిన రంగా హత్యను రెండు వర్గాల మధ్య జరిగినట్టుగా చిత్రీకరించారని మంద కృష్ణ మాదిగ  అన్నారు. తెలుగు నేలపై అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నాడు రంగా ఎదిగారని మంద కృష్ణ మాదిగ  అన్నారు. పార్టీలకతీతంగా అందరూ రంగ స్ఫూర్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారన్న మంద కృష్ణ మాదిగ ... రంగా స్ఫూర్తితో ముందుకు వెళ్లే ప్రతి ఒక్కరు రంగా పేరును ఉపయోగించుకుంటారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: