నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ కు సీఎం జగన్ మరోసారి షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన విశాఖలోని గీతం వైద్య కళాశాల పరిసరాల్లోని ప్రభుత్వ భూమి చుట్టూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కంచెలు వేసేశారు. ఉదయం నుంచే ఈ కసరత్తును మొదలుపెట్టారు. అంతేకాదు..  వైద్య కళాశాల భవనాలను కూలుస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే దారుల్లో బారికేడ్లు పెట్టారు. టీడీపీ ముఖ్యనేతలను గృహనిర్బంధం చేశారు. అయితే.. గతంలో స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో కంచెలు  ఏర్పాటు చేస్తున్నట్లు భీమిలి ఆర్డీవో చెప్పారు.

గీతం కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని ఆర్డీవో భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు కంచె మాత్రమే ఏర్పాటు చేశామని ఆర్డీవో భాస్కర్‌ రెడ్డి వివరించారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేవని ఆర్డీవో భాస్కర్‌రెడ్డి అన్నారు.  నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని ఆర్డీవో భాస్కర్‌రెడ్డి  క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: