తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్‌ సంబంధించి రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతోంది. నిన్న 564.08 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 2,49,969 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో వ్యవసాయ శాఖ నిధులు జమ చేసింది. 11 లక్షల 28 వేల 184.38 ఎకరాలకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 59 లక్షల 8 వేల 453 మంది రైతుల ఖాతాల్లో 5318.73 కోట్ల రూపాయలు జమయ్యాయి. కీలక వ్యవసాయ రంగమే భారత్‌ను ప్రపంచ దేశాల్లో అగ్ర స్థానంలో నిలబెడుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

అత్యధిక శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని... కేంద్ర ప్రభుత్వానికి ఉత్తమ సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడం చాలా విచారకరం అని తెలంగాణ ప్రభుత్వం  అంటోంది. ప్రపంచంలో అత్యధిక యువ శక్తి అందుబాటులో గల దేశం భారతదేశమేనని మంత్రి  అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: