పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ నెల 26 తేదీనాటికి ఇది వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో రాగల 3-4 రోజుల పాటు ఏపీ తెలంగాణా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశం ఉంది. కోస్తాంధ్ర , రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లా ఆనందపురంలో 9 సెంటిమీటర్లు, పెందుర్తి 8, తూర్పుగోదావరి 6, రాజమహేంద్రవరంలో 6.1 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదు  శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో 5 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యింది. గోదావరి నదిలో ధవళేశ్వరం వద్ద 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదులుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: