వందరోజుల్లో సోనియా గాంధీ ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చారని అన్నారు. తెలంగాణ తల్లి సోనియమ్మను స్వాగతించాల్సింది పోయి.. బీఆరెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆరెస్ నేతలు రాజకీయ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.


సోనియాగాంధీ తెలంగాణకు రావడంతో బీఆరెస్, బీజేపీ, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చ పెట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కెసిఆర్ కి ఏటీఎం గా మారిన ధరణిని తాము రద్దు చేసి తీరుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దోపిడీ పాలనను బొంద పెట్టడం ధరణితోనే మొదలుపెడతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: