కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణ రాష్ర్టానికి రానున్నారు. భాజపా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ మధ్యాహ్నాం 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా వస్తారు. 12: 05కి హెలికాప్టర్ లో అమిత్ షా గద్వాల్ ప్రయాణం అవుతారు. గద్వాల్‌లో భాజపా సకల జనుల విజయ సంకల్ఫ సభకు ముఖ్య అతిధిగా అమిత్ షా హాజరవుతారు. ఒంటి గంట నుంచి 1: 35వరకు అమిత్ షా బహిరంగ సభలో పాల్గొననున్నారు.

గద్వాల్ సభ అనంతరం అమిత్‌ షా నల్గొండకు వెళ్లనున్నారు. నల్గొండ, వరంగల్ లో నిర్వహించే సభల్లో అమిత్ షా పాల్గొంటారు. వరంగల్ సభ ముగించుకున్న తర్వాత అమిత్ షా హైదరాబాద్ కు వస్తారు. భాజపా మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేస్తారు. సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. సమావేశం తర్వాత రాత్రి 8గంటలకు ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: