మంత్రి కేటీఆర్‌లో గెలుపుపై నమ్మకం తగ్గిందా.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టం అని ఆయన భావిస్తున్నారా.. అందుకే ఆయన అంతగా కష్టపడుతున్నారా.. అన్న భావన ప్రజల్లో కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఏ అవకాశాన్ని వదలుకోవడం లేదు. సోషల్ మీడియా ఇంటర్వ్యూలు విపరీతంగా ఇస్తున్నారు. అలాగే ప్రజల్లోకి వెళ్తున్నారు. సార్వత్రికి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న ఆయన నిన్న మెట్రో రైలులోనూ ప్రయాణించారు.

హెచ్.ఐ.సి.సిలో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో హైదరాబాద్ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు. రహేజా మైండ్ స్పేస్ స్టేషన్ నుంచి బేగంపేట్ స్టేషన్ వరకు మంత్రి కేటీఆర్ మెట్రోలో ప్రయాణించారు. కేటీఆర్ ఒక సాధారణ ప్రయాణికుడిగా మెట్రోలో కనిపించారు. ప్రజలు ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించారు.  మంత్రి కేటీఆర్ 20 నిమిషాల వరకు మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణంలో భాగంగా పలువురితో కేటీఆర్ మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: