బిగ్ బాస్ షో ముందు కొట్లాడుకున్న యువకులపై ప్రతాపం చూపించడం కాదు... బిగ్ బాస్ యాజమాన్యం, అక్కినేని నాగార్జునపై మీ ప్రతాపం చూపించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్‌ విసిరారు. బిగ్‌ బాస్‌ షో ఆరాచకమైందని.. దీనికి అనుమతి ఇవ్వడం సరైంది కాదని తాను గతంలో చెప్పినా వినలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సజ్జనార్‌ సైబరాబాద్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు బిగ్‌ బాస్‌ షో క్రైమ్‌ ఇది చర్యలు తీసుకోవాలని కోరితే తాను ఏమీ చేయలేను కోర్టుకు వెళ్లమన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గుర్తు చేశారు. 


బిగ్ బాస్‌పై చర్య తీసుకునేందుకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, కోర్టులు భయపడ్డాయని సీపీఐ నారాయణ అన్నారు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరగుతున్నాయని సీపీఐ నారాయణ మండిపడ్డారు. డబ్బులకు కక్కుర్తిపడి హీరో నాగార్జున దీనికి వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్నారని సీపీఐ నారాయణ విమర్శించారు. బిగ్‌ బాస్‌ షోను తక్షణమే బ్యాన్‌ చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: