కాంగ్రెస్‌ దాడుల నుంచి తమ కార్యకర్తలను కాపాడాలని బీఆర్ఎస్‌ నేతలు డీజీపీని కలసి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలిరోజు నుంచే తమ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలు మొదలయ్యాయని వారు ఆరోపించారు. లకిడికాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ రవిగుప్తాను ఆ పార్టీ నేతల బృందం కలింది. తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవలి కాలంలో తమ పార్టీ నేతలపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను డీజీపీకి తెలియజేశారు.

హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం కిష్టాపురం జడ్పీటీసీ, ఎంపీటీసీలపై జరిగిన దౌర్జన్యం, ఇదే నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో తమ పార్టీ మండల ఉపాధ్యక్షుడిపై దాడి, భూపాలపల్లి, మానకొండూరు, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భౌతికదాడులు, హత్య, హత్యా ప్రయత్నాల గురించి వారు వివరించారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలోనే ఆయన ప్రేరణతోనే కాంగ్రెస్ శ్రేణులు భువనగిరి జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై దుర్బాషలాడి దాడికి పాల్పడ్డారని డీజీపీ రవిగుప్తాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs