ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రీపెయిడ్ సిమ్ వినియోగదారులను ఉద్దేశించి ప్రకటించింది. ఈ ఆఫర్ ను ఆల్ ఫ్రీ పథకంగా పేర్కొంది. ఇంతవరకు వివిధ ప్లాన్లలో ఉన్న వినియోగదారులు ఆల్ ఫ్రీ పథకానికి మారినప్పుడు మాత్రమే ఆ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ పధకంలో 144 ఆల్ ఫ్రీ ప్లాన్ లోకి మారిన వినియోగదారులు దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ కు ఎంతసేపైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చని తెలిపింది. 30 రోజుల కాలపరిమితితో పని చేసే ఈ ఆఫర్ లో అదనంగా 500 ఎంబీ ఉచిత డేటాను కూడా అందజేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కెఎస్ వరప్రసాద్ తెలిపారు. అదనపు వివరాలకు బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ కేర్ ను సంప్రదించాలని ఆయన సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి