దేశీయ స్టాక్‌మార్కెట్లు  అక్కడికక్కడే  స్తబ్దుగా  కొనసాగుతున్నాయి. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన  డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో  తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సెన్సెక్స్‌  చివరికి 38 పాయింట్లు కోల్పోయి  35,867 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు క్షీణించి 10,793 వద్ద ముగిసింది. మరోవైపు అమెరికా-ఉత్తరకొరియా దేశాల మధ్య సమావేశం నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా నష్టాలను నమోదు చేశాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ లో టీసీఎస్, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటో కార్ప్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి.  ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు కారణంగా  మార్కెట్లు ఒడిదొడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఇక ఓఎన్‌జీసీ, ఐవోసీ, గెయిల్‌, వేదాంతా, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్‌  స్వల్ప లాభాలతోనూ,  టీసీఎస్‌, హీరో మోటో, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌, ఐబీ హౌసింగ్‌, అల్ట్రాటెక్‌, సిప్లా, టైటన్‌, ఎంఅండ్‌ఎం, విప్రో  నష్టాలతోనూ కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: