కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీమ్‌ను మరో మూడు సంవత్సరాల పాటు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోగా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొదట ఈ సంవత్సరం పథకం ఆగిపోతుందని వార్తలు వినిపించినా... కేంద్రం తాజా నిర్ణయంతో మరో మూడేళ్లు ఈ పథకం కొనసాగనుంది. 
 
కేంద్రం ఈ పథకాన్ని పది సంవత్సరాల కాలపరిమితితో అమలు చేస్తోంది. ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండానే వృద్ధులు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ స్కీమ్ లో చేరాలనుకునేవారికి ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, వయస్సు ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఈ స్కీమ్ లో చేరి పాలసీని కొనుగోలు చేసిన వారు సంవత్సరానికి 8.3 శాతం వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. 
 
ఈ స్కీమ్ లో చేరిన వారు నెలకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ ను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకుని కేంద్రం మూడేళ్ల క్రితం ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఎల్.ఐ.సీ ద్వారా ఈ స్కీమ్ అమలవుతోంది. 2017 సంవత్సరం మే నెల 4వ తేదీన కేంద్రం ఈ స్కీమ్ ను ప్రారంభించింది. ఈ పాలసీ నగదును అత్యవసర వైద్య సహాయం కొరకు వినియోగించుకోవచ్చు. 
 
పాలసీ తీసుకున్న వారి జీవిత భాగస్వామి అవసరాల కోసం కూడా ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ అనంతరం ఆదాయం గురించి చింత లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ లో చేరాలంటే కనీసం 60 ఏళ్ల వయస్సు ఉండాలి. కనిష్టంగా 1,44,000 రూపాయల నుంచి గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. పథకంలో చేరిన వారు పదేళ్లలోపు మరణిస్తే కొనుగోలు చేసిన మొత్తాన్ని పూర్తిగా నామినీకి తిరిగి వెనక్కు ఇచ్చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: