ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండనే ఉంటుంది. కానీ మినిమమ్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండి తీరాల్సిందే. అయితే ఇప్పుడు బ్యాంకులు తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఒకవేళ మీ అకౌంట్లో 350 రూపాయలు లేకుంటే వెంటనే అకౌంట్లో వేసుకోండి. లేకపోతే నాలుగు లక్షల రూపాయల బెనిఫిట్ కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఆ వివరాలేమిటో ? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెడుతున్న పలు రకాల స్కీం లలో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన , ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేవి కూడా ఉన్నాయి. ఈ 2 స్కీమ్ ల వల్ల ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఈ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే, మీ అకౌంట్లో 350 రూపాయలు తప్పక కలిగి ఉండాలి. ఈ స్కీం లలో చేరిన వారు తమ బ్యాంకు ఖాతా నుంచి మే 31 లోపు ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

రెండు రకాల స్కీమ్స్ పై నాలుగు లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఈ జీవన జ్యోతి బీమా యోజన ద్వారా రెండు లక్షల బీమా డబ్బులు లభిస్తాయి. పాలసీదారుడు ఒకవేళ మరణిస్తే, ఆ డబ్బులు ఆయన కుటుంబ సభ్యులకు వర్తిస్తాయి. ఒకవేళ కరోనా వల్ల చనిపోయిన కూడా ఈ రెండు లక్షలు లభిస్తాయి. అయితే ఈ స్కీమ్ లో  చేరినవారు ఏడాదికి 350 రూపాయలు కట్టాలి..

అంతేకాకుండా సురక్ష బీమా యోజన స్కీమ్ కింద కూడా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ను పొందవచ్చు. ఇందులో ప్రమాదవశాత్తు మరణించినా లేదా అంగవైకల్యం ఏర్పడినా పాలసీ డబ్బులు వస్తాయి. అయితే ఈ స్కీమ్లో ఏడాదికి  రూ.12  కట్టాల్సి ఉంటుంది. అయితే నేరుగా ఈ స్కీమ్లో చేరవచ్చు. అందుకోసం మీ బ్యాంకు ఖాతాలో 350 రూపాయలు ఉండేలా చూసుకోండి..



మరింత సమాచారం తెలుసుకోండి: