ఈరోజు ఫాదర్స్ డే(జూన్ 20). మన అందరి జీవితాల్లో గుర్తుండిపోయే ఒక ప్రత్యేకమైన రోజు. మనల్ని కంటికి రెప్పలా కాపాడే మన నాన్నని గౌరవించుకునే రోజు.మరి ఈ ఫాదర్స్ డే రోజున మీ నాన్నకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా.? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఫాదర్స్ డేను పురస్కరించుకొని కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా 65శాతం డిస్కౌంట్లు ప్రకటించింది. మరి ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుని మీ నాన్నకి గిఫ్ట్ ఇచ్చేయండి.మరి ఆఫర్ లో ఉన్న ఆ గాడ్జెట్స్ ఏంటో  ఇప్పుడు చూద్దాం.


ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ చూస్తూనే ఉన్నాము.ఆలాగే స్మార్ట్ ఫోన్ తో పాటు బ్లూ టూత్ కూడా కామన్ అయిపొయింది.ఎంతసేపు ఇలాంటి అధునాతన గాడ్జెట్స్ ను మీరు వాడడమే కాకుండా ఈసారి మీ నాన్నకి గిఫ్ట్ గా ఇవ్వండి.అమెజాన్ లో జేబీఎల్ లైవ్ 500 బీటీ బ్లూటూత్ హెడ్ ఫోన్ పై 32 శాతం రాయితీని ప్రకటించింది.మాములుగా అయితే  దీని ఒరిజనల్ ధర రూ.9,999లుగా ఉంది. అయితే 32 శాతం డిస్కౌంటుపై ప్రస్తుతం రూ.6,799లకు లభిస్తుంది. అలాగే మరొక ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఒప్పో ఎంకో ఎం31 ఇయర్ ఫోన్లపై అమెజాన్ 40 శాతం డిస్కౌంటు ఇంది. ఈ బ్లూటూత్ ఫోన్లు ఒరిజనల్ ధర రూ.2,999 లుగా ఉంది.రాయితీ తర్వాత 1,799 రూపాయలతో  అందుబాటులోకి వస్తుంది.అలాగే మరొక బ్రాండ్ అయిన జాబ్ర్ ఇలైట్ యాక్టివ్ 65టీ వైర్లెస్ ఇయర్ బడ్స్ పై అమెజాన్ లో 65 శాతం రాయితీ ఉంది. అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ లో ప్రస్తుతం ఇది రూ.5,999లకు లభ్యం అవుతుంది. సింగిల్ ఛార్జింగ్ తో 15 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇందులో ఉంది.


మరొక టాప్ బ్రాండ్ అయిన రియల్ మీ స్మార్ట్ వాచ్ ఎస్ ప్రో వాచ్ పైన 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది అసలు ధర 13,999లు కాగా రాయితీ అనంతరం రూ.10,500లకు అందుబాటులో ఉంది. ఈ వాచ్ స్పెషల్ ఏంటంటే వాటర్ రిసెస్టింట్ తో పాటు హార్డ్, SpO2 మానిటర్ ను అందిస్తుంది.బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారా. అయితే 5 వేల రూపాయలలోపు స్మార్ట్ వాచ్ మీకోసం అందుబాటులోకి వచ్చింది.అమాజ్ ఫిట్ బిప్ యూ ప్రో మీ నాన్నకి గిఫ్ట్ గా అందజేయవచ్చు. దీని ధర రూ.6,999లు కాగా, ప్రస్తుతం డిస్కౌంట్ ధరతో 4,999లకు కొనుగోలు చేయవచ్చు.అలాగే వన్ ప్లస్ స్మార్ట్ బ్యాండ్ అమెజాన్ లో 11 శాతం రాయితీనిచ్చింది.అసలు ధర రూ.2,799లు కాగా.. ఫిట్నెస్ ట్రాకర్ పై 300 రూపాయల రాయితీతో రూ.2,499లకు కొనుగోలు చేయవచ్చు. అలాగే మరొక టాప్ బ్రాండ్ ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5పై అమెజాన్ లో 17 శాతం రాయితీ ఉంది. దీని ధర 2,999లు కాగా, రూ.500ల ఫ్లాట్ తగ్గింపుతో రూ.2,488లకు కొనుగోలు చేయవచ్చు.చూసారు కదా కళ్ళు చెదిరే ఆఫర్స్ తో అమెజాన్ రెడీ అయిపొయింది. మరి మీరు కూడా మీ నాన్నని సప్రైజ్ చేసేయడానికి రెడీ అయిపోండి.. !!




మరింత సమాచారం తెలుసుకోండి: