విధి ఆడే వింత నాటకం లో మనిషి కేవలం ఒక కీలు బొమ్మలాంటి వాడే అన్నది పెద్దలు చెబుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీయాలి.. ఇక ఎవరిని  అనాధలుగా మార్చాలి అన్నది ఇదే నిర్ణయిస్తుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే ఇదంతా ట్రాష్ అని నేటి జనరేషన్ లో జనాలు కొట్టి పారేస్తున్న వెలుగు లోకి వస్తున్న కొన్ని ఘటనలు చూసిన తర్వాత నిజం గానే పెద్దలు చెప్పిన మాట నిజమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతా సాఫీగా సాగి పోతుంది అనుకుంటున్నా సమయం లో ఎంతో మంది జీవితాల్లో విషాదం నిండి పోతున్న ఘటనలు వెలుగు లోకి వస్తూ ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు ఏదో పెద్ద పాపం చేశారు అన్నట్లుగానే తల్లిదండ్రులను దూరం చేసి ఇక అనాధలుగా మార్చి వీధి చిన్న వయసులోనే చిన్నారులకు సవాల్ విసురుతూ ఉన్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయ్ అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మెదక్ కు చెందిన 36 ఏళ్ల మల్లేష్ కు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. అయితే ఐదేళ్ల క్రితమే అనారోగ్యంతో భార్య రమ్య చనిపోయింది. దీంతో భార్య చనిపోయిన మరో పెళ్లి చేసుకోకుండా మల్లేష్ కూతురి కోసమే ఒంటరిగా ఉండిపోయాడు.


 తల్లి లేని లోటు తెలియకుండా కూతురిని పెంచాడు. కానీ ఇటీవల మరోసారి వారి కుటుంబంలో ఉన్న సంతోషాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. వెరసి ఇప్పటికే తల్లిని దూరం చేసిన విధి ఇక ఇప్పుడు తండ్రిని కూడా దూరం చేసి ఆ బాలికను అనాధగా మార్చేసింది. ఇటీవల అనారోగ్యంతో బాధపడిన మల్లేష్ ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రికి వెళ్లేందుకు సికింద్రాబాద్ చేరుకున్నాడూ. అయితే ఉదయం తండ్రిని నిద్రలేపేందుకు కుమార్తె ప్రయత్నించిన నిద్ర లేవలేదు. అక్కడే ఉన్న స్థానికులు గమనించగా అతని చనిపోయినట్లు తెలిసింది. దీంతో బాలిక అనాధగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: