కావాల్సిన ప‌దార్థాలు:
మైదాపిండి- ఒకటిన్నర కప్పు
బంగాళాదుంప- ఒకటి
అల్లంతురుము- ఒక‌ టీస్పూన్‌

 

జీలకర్రపొడి- అరటీస్పూన్‌
స్వీట్‌కార్న్- ఒక‌ కప్పు
క్యాప్సికమ్‌ ముక్కలు- ఒక‌ కప్పు 

 

ప‌చ్చిమిర్చి- రెండు 
గ‌రంమసాలాపొడి- ఒక‌ టీస్పూన్‌
సెనగపిండి- రెండు టీ స్పూన్లు
ఉప్పు- రుచికి తగినంత

 

నూనె- వేయించడానికి సరిపడా
మిరియాలపొడి- అర‌ టీస్పూన్‌
అనాసపువ్వుపొడి- అరటీస్పూన్‌
కొత్తిమీర త‌రుగు- అర క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా బంగాళాదుంపను ఉడ‌క‌బెట్టుకుని.. లైట్‌గా చిదుముకోవాలి. అలాగే  స్వీట్‌కార్న్‌ లేదా మొక్కజొన్న గింజలు కూడా  ఉడ‌క‌బెట్టుకుని.. లైట్‌గా చిదుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో మైదా తీసుకుని అందులో ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో టీస్పూను నూనె మ‌రియు తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి తడిబట్ట కప్పి సుమారు పావు గంట‌ పాటు పక్కన ఉంచాలి. 

 

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని.. అందులో రెండు టీస్పూన్ల నూనెవేసి సెనగపిండి వేసి వేయించి తీయాలి. అందులోనే మళ్లీ రెండుటీస్పూన్ల నూనెవేసి మొక్కజొన్న గింజలు, క్యాప్సికమ్‌ముక్కలు, బంగాళాదుంపముక్కలు, అల్లంతురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. ఇప్పుడు వేయించిన సెనగపిండి, గరంమసాలా, మిరియాలపొడి, జీలకర్రపొడి వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు చివ‌రిగా ఇందులో కొత్తిమీర జ‌ల్లి స్ట‌వ్ ఆప్ చేయాలి. 

 

ఆ త‌ర్వాత ముందుగా క‌లిపి పెట్టుకున్న మైదా పిండిని చపాతీల్లా చేయాలి. ఇప్పుడు చ‌పాతీల‌ను రెండుగా కోసి కోనుల్లా చుట్టి త‌యారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టి సమోసాలా మడిచి పెట్టుకోవాలి. మ‌రోవైపు స్ట‌వ్‌పై పాన్ పెట్టుకుని నూనె పోయాలి. నూనె కాగిన త‌ర్వాత స‌మోసాల‌ను వేసి మీకు కావాల్సిన రంగులో వేయించుకుంటే స‌రిపోతుంది. అంటే టేస్టీ టేస్టీ `స్వీట్‌కార్న్‌ క్యాప్సికమ్‌ సమోసా రెడీ. ఈ సూప‌ర్ రెసిపీని మీరూ త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: