ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... క్యారెట్ లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. క్యాన్సర్ పేషెంట్ల ఆరోగ్యానికి క్యారెట్లు చాలా మంచివి. క్యారెట్లు తింటే శరీరానికి మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. వీటిలో వుండే పోషకాలు మరే దాంట్లో లభించవు. ఇక ఆరోగ్యవంతమైన క్యారెట్ తో రుచికరమైన పనియారం ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.....

క్యారెట్‌ పనియారం తయారు చెయ్యడానికి  కావలసిన పదార్ధాలు :

దోసెల పిండి - 1 కప్పు,
ఉల్లిపాయలు - 3 (స్మాల్‌ సైజ్, చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి),
పచ్చిమిర్చి - 1(చిన్నచిన్నగా కట్‌ చేసుకోవాలి),
అల్లం పేస్ట్‌ - పావు టీ స్పూన్‌,
క్యారెట్‌ తురుము - 3 టేబుల్‌ స్పూన్లు,
ఆవాలు - పావు టీ స్పూన్‌,
జీలకర్ర - పావు టీ స్పూన్‌,
మినప్పప్పు - పావు టీ స్పూన్‌,
కరివేపాకు - 1 లేదా 2 రెమ్మలు,
ఇంగువ - చిటికెడు,
పసుపు - కొద్దిగా,
ఉప్పు - తగినంత,
నూనె - 2 టీ స్పూన్లు...

రుచికరమైన క్యారెట్ పనియారం తయారు చేసే విధానం....

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. దోసెల పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, క్యారెట్‌ తురుము, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కలుపు కోవాలి. ఇప్పుడు అందులో ఇంగువ, పసుపు, ఉప్పు వేసుకుని మరోసారి బాగా కలుపుకుని.. పొంగనాల పాన్‌లో అడుగున నూనె రాసుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం వేసుకొని, కుక్కర్‌లో లేదా ఓవెన్‌లో ఉడికించుకోవాలి.ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన క్యారెట్ పనియారం మీరు ఇంట్లో తయారు చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోవడం కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: