
గ్రేవీ కోసం కావలిసిన పదార్ధాలు :
3 పండిన ఎర్రటి టొమాటోలు
1 ఇంచ్ అల్లం ముక్క
1/4 cup జీడిపప్పు , 15 min నానపెట్టాలి
3 పచ్చిమిర్చి
4 వెల్లూలి
2 యాలకలు
3 లవంగాలు
2 ఎండు మిర్చి
1/2 tsp మిరియాలు
1/4 cup మీగడ పెరుగు
తగినన్ని నీళ్ళు మెత్తగా రుబ్బుకోడానికి
కూర కోసం కావలిసిన పదార్ధాలు :
1/2 cup నూనె
3/4 cup జీడిపప్పు
150 gms మష్రూమ్స్
1 ఉల్లిపాయ సన్నని తరుగు
1 tsp జీలకర్ర
1/2 tsp కారం
1/2 tsp గరం మసాలా
1/2 tsp ధనియాల పొడి
2 tsps కారం
1.5 tsps ఉప్పు
350 ml నీళ్ళు
1 tbsp నెయ్యి
2 tbsps కొత్తిమీర తరుగు
1/2 చెక్క నిమ్మరసం
తయారీ విధానం :
ముందుగా ఒక మిక్సీ జార్ లో గ్రేవీ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని, పలుకులు లేకుండా పేస్టులా చేసుకోవాలి. ముందుగా జీడిపప్పు నానపెట్టుకుంటే బాగా గ్రైండ్ అవుతాయి. తరువాత నూనె వేడి చేసి జీడిపప్పు వేసి సగం వేపుకోవాలి. తర్వాత మష్రూమ్స్ కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుని తీసి పక్కనున్చుకోవాలి. అదే నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ తరుగు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి.
వేగిన ఉల్లిపాయాల్లో కారం, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మసాలాల పొడిని బాగా వేపుకోవాలి.ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసి 3-4 నిమిషాలు ఉడకనిచ్చి, 350 ml నీళ్ళు పోసి గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలేదాకా పొయ్యి మీద ఉంచాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నూనె తేలాక జీడిపప్ప్పు, మష్రూమ్స్ వేసి 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆఖరున నెయ్యి కొత్తిమీర తరుగు చల్లి మరో నిమిషం ఉడకనివ్వాలి.అంతే జీడిపప్పు మష్రూమ్స్ మసాలా కర్రీ రెడీ..