అత్తా మీద కోపం దుత్త మీద తీసింది అనే సామెత వినే ఉంటాము. ఓ వ్యక్తి అత్తింటి వారిపై ప్రతీకారం పేరుతో భారీ కుట్ర పన్నాడు. భార్యతో పాటు అత్తామామలు, మరదలిని అంతమొందించేందుకు చేపల కూర వండి, వారికి తినిపించాడు. అందులో థాలియం అనే రసాయన మూలకాన్ని కలపడంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో నిందితుడి అత్త, మరదలు మృత్యువాత పడగా, భార్య, మామ చికిత్స పొందుతున్నారు.