సినిమా ఇండస్ట్రీ లో అనేక మందికి పేర్ల ముందు ఏదో ఒక ట్యాగ్ లైన్ ఉంటూ ఉండడం సర్వసాధారణం. ఇక వారిని ఆ ట్యాగ్ లైన్ తో ఆ హీరో అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ వస్తుంటారు. ఇక సినిమా స్టార్ట్ అయ్యింది అంటే చాలు హీరో పేరు పడగానే ఆ హీరో పేరు కంటే ముందు అతని ట్యాగ్ లైన్ పడుతూ ఉంటుంది. దానితో హీరో అభిమానులు కూడా ఎంతో ఆనంద పడుతూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజకు కూడా ఇలాంటి ట్యాగ్ లైన్ ఉంది. రవితేజకు మాస్ మహారాజా అనే ట్యాంక్ లైన్ ఉంది. సినిమాలో ఆయన పేరు పడే ముందు మాస్ మహారాజా అని పడుతూ ఉంటుంది. అలా పడడంతో ఆయన అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతుంటారు. తాజాగా రవితేజ "భర్త మహాశయులకు విజ్ఞప్తి" అనే సినిమాలో హీరో గా నటించాడు. డింపుల్ హయాతి , ఆశిక రంగనాథ్మూవీ లో హీరోయిన్లుగా నటించారు. కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 14 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా క్లాస్ ఎంటర్టైనర్ కావడంతో తన ఈమేజ్ ఇంపాక్ట్ ఏ మాత్రం పడకుండా ఉండే ఉద్దేశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజ పేరు కేవలం రవితేజ అని మాత్రమే పడనున్నట్లు మాస్ మహారాజా అనే ట్యాగ్ లైన్ ను ఈ సినిమాలో వేయకూడదు అని రవితేజ ప్రత్యేకంగా మూవీ బృందానికి సూచించినట్లు తెలుస్తోంది. ఇలా తన ఈమేజ్ కారణంగా సినిమాపై ఏ మాత్రం ఇంపాక్ట్ పడకూడదు అనే ఉద్దేశంతో రవితేజ తన ట్యాగ్ లైన్ ని కూడా ఈ సినిమా నుండి తీసి వేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా సాధారణమైన టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి రవితేజ ఈ మధ్య కాలంతో వరుస ఆపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt