బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్9 ముగిసింది. బిగ్ బాస్ షో విజేతగా కళ్యాణ్ పడాల నిలిచారు.  తనూజ, కళ్యాణ్ లలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారని ముందునుంచి ప్రచారం జరగగా కళ్యాణ్ ను అదృష్టం వరించింది. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లను సాధించడం  కళ్యాణ్ కు ప్లస్ అయింది. కామన్ మ్యాన్ అయిన కళ్యాణ్ 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందుకున్నారు.

బాల్యం నుంచి సినిమాలు అంటే ఆసక్తి ఉన్న  కళ్యాణ్ పడాల సీఆర్పీఎఫ్ జవాన్ గా కూడా పని చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగంలో చేరిన కళ్యాణ్  ప్రియ ఎలిమినేషన్ అనంతరం ఆటతీరును మార్చుకుని అభిమానులకు మరింత చేరువయ్యారు.  ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చి తనదైన ఆటతో కళ్యాణ్ ఆశ్చర్యపరిచారు. బిగ్ బాస్ షోలో మేల్ కంటెస్టెంట్లు మాత్రమే విజేతలుగా నిలుస్తుండగా కళ్యాణ్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేశారు.

షో స్పాన్సర్స్ లో ఒకటైన రాఫ్ గ్రిప్పింగ్ కళ్యాణ్ కు మరో 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ను అందించడం కొసమెరుపు. మారుతీ సుజుకి విక్టోరియా కారును సైతం కళ్యాణ్ సొంతం చేసుకోవడం గమనార్హం.  కళ్యాణ్ పడాల  మాట్లాడుతూ నన్ను ప్రేమించిన వారికి నన్ను నమ్మి ఓటేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.  ఈ సీజన్ లో ప్రియ, శ్రీజ, తనూజ నన్ను ఎంతో  సపోర్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. వాళ్లకు స్పెషల్ థ్యాంక్స్ అని కామెంట్లు చేశారు.

ఒకానొక సమయంలో నాకు ధైర్యం ఇచ్చి ముందుకు పంపిన వ్యక్తి తనూజ అని ఇందులో ఎలాంటి సందేహం లేదని  చెప్పుకొచ్చారు. నా తల్లిదండ్రులు వారి స్థాయికి మించి నన్ను పోషించారని వాళ్ళు లేకపోతే నేను లేనని ఆయన తెలిపారు.  ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ తో నా ప్రయాణం ఇక్కడివరకూ సాగిందని అందరికీ థ్యాంక్స్ అని కళ్యాణ్ పడాల  కామెంట్లు చేశారు. వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించడమే కళ్యాణ్ సక్సెస్ సీక్రెట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: