- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ‘సలార్’ (Salaar: Part 1 – Ceasefire) కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్‌కు, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎలివేషన్లు తోడైతే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ఈ సినిమా నిరూపించింది. ఈ క్రేజీ సినిమా విడుదలై రెండేళ్లు కావస్తున్నా, నేటికీ సోషల్ మీడియాలో ‘సలార్’ నామస్మరణ వినిపిస్తూనే ఉంది. కేవలం వెండితెరపైనే కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ సినిమా సృష్టించిన రికార్డులు కనీవినీ ఎరుగనివి.


ఓటిటిలో అన్‌స్టాపబుల్ రికార్డు :
సాధారణంగా ఏ సినిమాకైనా క్రేజ్ అనేది థియేటర్లలో ఉన్నంత వరకే ఉంటుంది. ఆ తర్వాత ఓటిటిలోకి వచ్చాక కొన్ని వారాల పాటు ట్రెండింగ్‌లో ఉండటం సహజం. కానీ ‘సలార్’ విషయంలో సీన్ పూర్తిగా వేరు. ఈ సినిమా జియో సినిమా హిందీ వెర్షన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ఫీట్‌ను నమోదు చేసింది. ఇండియా వైడ్ ఓటిటి ట్రెండింగ్ లిస్ట్‌లో ఆల్ టైమ్ టాప్ 10లో ‘సలార్’ వరుసగా 500 రోజులకు పైగా కొనసాగింది. ఇలా ఏ ఇతర ఇండియన్ సినిమాకు సాధ్యం కాని ఈ రికార్డు, ప్రభాస్ మాస్ పవర్ కు నిదర్శనం.


డైలీ డోసేజ్ సలార్:
సోషల్ మీడియాలో ‘డైలీ డోసేజ్ సలార్’ అనే ట్రెండ్ ఈ సినిమాతోనే మొదలైంది. అంటే ప్రతిరోజూ ఈ సినిమాలోని ఏదో ఒక సీన్ లేదా మ్యూజిక్ బిట్‌ను అభిమానులు ఆస్వాదిస్తూనే ఉండటం దీని ప్రత్యేకత. ఫ‌స్ట్ పార్ట్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో సలార్ 2: శౌర్యాంగ పర్వంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫ‌స్ట్‌పార్ట్  ముగిసిన తీరు, ప్రభాస్ పోషించిన ‘దేవ’ పాత్ర చుట్టూ ఉన్న మిస్టరీ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటిలో ‘సలార్ 2’ కోసమే మెజారిటీ ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.


ఖాన్సార్ బ్యాక్ డ్రాప్.. ప్రశాంత్ నీల్ సృష్టించిన ఖాన్సార్ ప్రపంచం, అందులోని రాజకీయం పార్ట్ 2లో మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. ప్రభాస్ - పృథ్వీరాజ్ పోరు: స్నేహితులుగా ఉన్న దేవ - వరద రాజ మన్నార్ శత్రువులుగా ఎలా మారతారనే పాయింట్ సీక్వెల్‌కు ప్రధాన ఆకర్షణ. ప్రభాస్ నుంచి రానున్న సీక్వెల్స్ లో (కల్కి 2, సలార్ 2) మాస్ ఆడియన్స్‌కు మాత్రం ‘సలార్ 2’ పైనే ఎక్కువ మొగ్గు ఉంది. ఈ సినిమా అందించిన ఇంపాక్ట్ వల్లనే ప్రభాస్ మళ్ళీ తన పాత మాస్ ట్రాక్ లోకి వచ్చి బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు. మరి త్వరలోనే రాబోతున్న ‘శౌర్యాంగ పర్వం’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: