టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన వినూత్నమైన ఆలోచనలతో సినిమాలనే కాదు, సినిమా ప్రమోషన్లను కూడా నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో 'మన శంకరవరప్రసాద్ గారు' (Mana Shankara Vara prasad Garu) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన షేర్ చేసిన ఒక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.


ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. దీనిని ఉపయోగించి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోని ఐకానిక్ పాత్రలతో తాను సెల్ఫీలు దిగినట్లుగా ఒక అద్భుతమైన వీడియోను రూపొందించారు.ఖైదీ నుండి మన శంకరవరప్రసాద్ వరకు: ఈ వీడియోలో అనిల్ రావిపూడి కాలంలో వెనక్కి వెళ్లి చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలైన 'ఖైదీ', 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'ముఠా మేస్త్రి', 'ఇంద్ర', 'ఠాగూర్' వంటి చిత్రాల సెట్స్‌లో చిరంజీవితో సెల్ఫీలు దిగుతున్నట్లు కనిపిస్తుంది. "అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి.. ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు.. థాంక్స్ టు ఏఐ" అంటూ అనిల్ రావిపూడి ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.



 "ఏఐ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు" అని ఆయన పేర్కొనడం విశేషం. టెక్నాలజీని తప్పుడు పనులకు కాకుండా ఇలా స్వీట్ మెమరీస్ క్రియేట్ చేయడానికి వాడొచ్చని ఆయన నిరూపించారు.అనిల్ రావిపూడి షేర్ చేసిన ఈ వీడియో చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. తమ అభిమాన హీరో వింటేజ్ లుక్స్‌ను, ఆనాటి ఐకానిక్ పాత్రలను మళ్ళీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం వారికి పెద్ద సర్ ప్రైజ్‌గా మారింది. ముఖ్యంగా 'గ్యాంగ్ లీడర్' లుక్‌లో చిరంజీవితో అనిల్ ఉన్న ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.చిరంజీవిలోని అసలైన వినోదాన్ని పండించడంలో అనిల్ రావిపూడి సిద్దహస్తుడు. ఈ ఏఐ వీడియో ద్వారా ఆయన సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశారు. సంక్రాంతి బరిలో 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: