ఇక ఈ సినిమా కథా నేపథ్యం విషయానికి వస్తే, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ వాతావరణం, స్థానిక సంస్కృతి, ఎమోషన్స్‌ను ప్రధానంగా చూపించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యం అఖిల్ కెరీర్‌లో ఒక కొత్త తరహా పాత్రగా ఉండనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అఖిల్ – భాగ్యశ్రీ కలయిక ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుండగా, ఇద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ ఎంతో సహజంగా, ఆకట్టుకునేలా ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా యువ ప్రేక్షకులను ఈ జంట బాగా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో, ‘లెనిన్’ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకంతో అఖిల్ ఎంతో కేర్ తీసుకుంటున్నాడట. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వస్తోందని, ఇప్పటివరకు చూసిన ఫుటేజ్‌పై చిత్ర యూనిట్ పూర్తి సంతృప్తితో ఉందని టాక్ వినిపిస్తోంది.మొత్తానికి, అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అఖిల్‌కు భారీ హిట్ దక్కుతుందా? ప్రేక్షకుల అంచనాలను ‘లెనిన్’ ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం ఇండస్ట్రీలో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తూ, శరవేగంగా రెడీ అవుతోంది. అఖిల్ పెళ్ళి తరువాత ఫస్ట్ రిలీజ్ కాబోతున్న సినిమా ఇదే కావడం గమనార్హం..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి