టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ దర్శకుడిగా క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం బోయపాటి కి సరైన విజయం దక్కలేదు. ఆఖరుగా బోయపాటి శ్రీను కు బాలకృష్ణ తో రూపొందించిన అఖండ మూవీ తో మంచి విజయం దక్కింది. ఈ సినిమా 2021 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను , రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా స్కంద అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ 2023 వ సంవత్సరం విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను తనకు ఎంతో కలిసి వచ్చిన బాలకృష్ణ తో అఖండ 2 అనే మూవీ ని రూపొందించాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ హీరో గా నటించిన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తాజాగా డిసెంబర్ 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది భావించారు. అలా భారీ అచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. ఆయన ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత కలెక్షన్లు తగ్గాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకునే అవకాశాలు చాలా తక్కువ శాతం మాత్రమే కనబడుతున్నాయి. దానితో బోయపాటి శ్రీను కి ఈ సంవత్సరం అఖండ 2 మూవీ తో కూడా అపజయం దక్కే అవకాశాలు ఉన్నాయి అని , ఆయనకు ఈ సంవత్సరం కూడా పెద్దగా కలిసి రాలేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: