-
AdiNarayanaReddy
-
anil music
-
archana
-
Blockbuster hit
-
CBN
-
Chitram
-
Cinema
-
Darsakudu
-
December
-
dharma
-
Director
-
dr rajasekhar
-
Friday
-
Hero
-
Indian
-
kiran
-
Kumaar
-
lord siva
-
Muni
-
Nani
-
Prabhas
-
praveen
-
priyadarshi
-
Prize
-
producer
-
Producer
-
Reddy
-
Sai Kumar
-
Shiva
-
Sravan Kumar
-
sricharan pakala
-
srinivas
-
Success
-
sunday
-
Suresh
-
vishwa
డిసెంబర్ 25న రాబోతోన్న ‘శంబాల’ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం
‘శంబాల’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
డిసెంబర్ 25న ‘శంబాల’తో హిట్టు కొట్టబోతోన్నాం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆది సాయి కుమార్
వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, తమన్, అనిల్ రావిపూడి, నవీన్ యెర్నెని, టీజీ విశ్వ ప్రసాద్, అశ్విన్ బాబు, మైత్రి శశి వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. ‘‘శంబాల’ మీద ముందు నుంచీ పాజిటివ్ వైబ్ ఉంది. యుగంధర్ ముని మంచి దర్శకుడు. శ్రీ చరణ్ పాకాల గారి ఆర్ఆర్, మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో ధర్మ కారెక్టర్ కోసం సాయి కుమార్ గారి వద్దకు వెళ్లాను. ఆ టైంలో ఆయన మాకు చేసిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇండస్ట్రీలో నాకు పరిచయమైన పెద్ద హీరో ఆయనే. సాయి కుమార్ గారి వల్లే నా కెరీర్ బాగుందని అనుకుంటూ ఉంటాను. ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరి గురించి పాజిటివ్‌గానే మాట్లాడతారు. ప్రతీ ఒక్క సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఆది అన్న ‘ప్రేమ కావాలి’ సినిమా టైంకి నేను ఇంటర్‌లో ఉన్నాను. హిట్లు కొట్టడం ఒకెత్తు అయితే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం మరో ఎత్తు అని ఆది అన్నని చూస్తే అర్థమైంది. ‘శంబాల’ గురించి పాజిటివ్ టాక్ వింటున్నాను. ఈ సారి ఆది అన్నకి మంచి సక్సెస్ రావాలని అందరం కోరుకుంటున్నాం. డిసెంబర్ 25న ‘శంబాల’ని అందరూ చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ ట్రైలర్ బాగుంది. ఆదికి ఈ చిత్రంతో మంచి విజయం రావాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు.. మంచి చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. నిరంతరం కష్టపడుతూ ఉండే ఆదికి ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ రావాలి. యుగంధర్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. కథను నమ్మి ఇంత ఖర్చు పెట్టిన నిర్మాతలకు హ్యాట్సాఫ్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని థియేటర్లోనే అందరూ చూడండి’ అని అన్నారు.
ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా ఈ ప్రయాణంలో మీడియా, ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. గత ఏడాది డిసెంబర్‌లో ‘శంబాల’ ఫస్ట్ పోస్టర్ నుంచి అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. టీజర్‌ను దుల్కర్ గారు రిలీజ్ చేశారు. ప్రభాస్ గారు, నాని గారు రిలీజ్ చేసిన ట్రైలర్‌లు అంచనాల్ని పెంచేశాయి. యుగంధర్ ముని అద్భుతంగా తీశాడు కాబట్టే ఈ రోజు చిత్రంపై హైప్ ఏర్పడింది. దర్శక, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని రూపొందించారు. బడ్జెట్ ఎక్కువ అయినా కూడా నిర్మాతలు మహీధర్ గారు, రాజశేఖర్ గారు వెనుకాడలేదు. ప్రవీణ్ విజువల్స్, శ్రీచరణ్ ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. ‘శంబాల’లో అందరూ అద్భుతంగా నటించారు. థియేటర్లో అందరూ మా మూవీని చూసి సర్ ప్రైజ్ అవుతారు. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తారు. నాకు సినిమా తప్పా ఇంకో ప్రపంచం తెలీదు. సాయి కుమార్ కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఆయన కొడుకుని అని చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీల్ అవుతాను. నేను హిట్టు కొట్టాలని ఆయన ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘శంబాల’తో మేం డిసెంబర్ 25న హిట్టు కొట్టబోతోన్నాం. క్రిస్మస్‌కి రిలీజ్ కాబోతోన్న అన్ని చిత్రాలు హిట్ అవ్వాల’ని అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘శంబాల’కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు, సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారు నాకు ఫ్యామిలీ మెంబర్. ఆది నాకు బ్రదర్ లాంటి వాడు. ఆదికి ఎన్నో జానర్లను ట్రై చేశాడు. ఆది అద్భుతమైన నటుడు. ఈ చిత్రంతో ఆదికి మంచి విజయం దక్కాలి. ‘పటాస్’కి సాయి కుమార్ చేసిన సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతీ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమా గురించి సాయి కుమార్ గారు ఎంక్వైరీ చేస్తుంటారు. హిట్ అయితే సంతోషంగా చెబుతారు. ఫ్లాప్ అయితే బాధగా చెబుతారు. అలా చెప్పగలిగే గుణం చాలా తక్కువ మందిలో ఉంటుంది. డిసెంబర్ 25న ‘శంబాల’ బ్లాక్ బస్టర్ అన్న టాక్‌ను ఆయన విని సంతోషించాలి. ‘శంబాల’ మూవీని డిసెంబర్ 25న అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘మా అమ్మానాన్న గార్లతో మొదలైన సినీ ప్రయాణం ప్రేక్షకుల ఆదరణతో ఇంకా కొనసాగుతోంది. 1975లో నేను హీరోగా పరిచయం అయ్యాను. 2011లో ‘ప్రేమ కావాలి’తో హీరోగా పరిచయం అయ్యారు. జయాపజయాలు అందరికీ సహజమే. కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ‘శంబాల’తో ఆదికి విజయం దక్కబోతోంది. నిజంగానే మునిలా యుగంధర్ ఈ మూవీని రూపొందించారు. గత డిసెంబర్‌లో రిలీజ్ చేసిన పోస్టర్ నుంచి ఇప్పటి వరకు పాజిటివిటీ ఏర్పడుతూనే వచ్చింది. దుల్కర్, ప్రభాస్, నాని ఇలా అందరూ ‘శంబాల’కు సపోర్ట్ చేశారు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తారు. కిరణ్ అబ్బవరం, అనిల్ రావిపూడి, ప్రియదర్శి ఇలా అందరూ నాకు ఫ్యామిలీ లాంటివారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మా కోసం నిలబడిన అభిమానులకు థాంక్స్. అభిమానుల పేరు, నా పేరుని ఈ సారి ఆది నిలబెడతారు. మైత్రి శశి గారు ఈ మూవీని చూసి హిట్ అవుతుందని చెప్పడంతో కాస్త ఉపశమనం కలిగించింది. ఓవర్సీస్‌లో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు. ‘శంబాల’ డిసెంబర్ 25న కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
తమన్ మాట్లాడుతూ .. ‘సాయి కుమార్ గారు, ఆది మంచి మనసు చూసి ఈ రోజు ఇంత మంది ఇక్కడికి వచ్చారు. ఆది చాలా మంచి వ్యక్తి. ఆది ‘శంబాల’ గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. డిసెంబర్ 25న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ అదిరిపోయింది. ఈ రోజు ఇచ్చిన లైవ్ పర్ఫామెన్స్ అదరగొట్టేశాడు. దర్శక, నిర్మాతలు, శంబాల టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
అశ్విన్ బాబు మాట్లాడుతూ .. ‘‘శంబాల’ ప్రమోషన్స్ చాలా యూనిక్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ మూవీని చూడాలని ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు. యుగంధర్ చెప్పిన కథను నమ్మి భారీగా ఖర్చు పెట్టి తీసిన నిర్మాతలకు కంగ్రాట్స్. ఈ చిత్రం మంచి విజయం సాధించబోతోంది. ఆది నాకు మంచి స్నేహితుడు. ఆది ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి నటించాడు. డిసెంబర్ 25న ఈ చిత్రం రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘మహిధర్ నాకు 20 ఏళ్ల నుంచి తెలుసు. సియాటెల్‌లో ఇండియన్ చిత్రాల్ని మేం కలిసి రిలీజ్ చేస్తుండేవాళ్లం. అలా మా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. రెండు, మూడు వారాల క్రితం ‘శంబాల’ సినిమాని చూశాను. ఆదికి బ్లాక్ బస్టర్ హిట్ రాబోతోంది. ‘శంబాల’టీంకి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ .. ‘‘శంబాల’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. సైన్స్ గొప్పదా? శాస్త్రం అని గొప్పదా? అంటూ చూపించిన అంశాలు అద్భుతంగా ఉన్నాయి. ఆది అన్నకి ఈ చిత్రంతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ‘శంబాల’ టీంకు ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని నేను చూడబోతోన్నాను. ఈ మూవీని అందరూ థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. ‘నిర్మాత రాజశేఖర్ గారి వల్లే ఈ ‘శంబాల’ స్టార్ట్ అయింది. ఆ తరువాత కథను మహీధర్ గారికి కూడా చెప్పాం. ఆ ఇద్దరే ఈ చిత్రానికి బ్యాక్ బోన్‌లా నిల్చున్నారు. అన్ని రకాల ఎమోషన్స్ పండించే హీరో కావాలని నిర్మాతలకు చెప్పాను. ఆ తరువాత ఆది గారు మా ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆయనకు కూడా కథ చాలా నచ్చింది. నాకు అండగా నిలిచిన ఆది గారికి థాంక్స్. నా టెక్నికల్ టీం సపోర్ట్ వల్లే సినిమాను ఇంత గొప్పగా తీయగలిగాను’ అని అన్నారు.
నిర్మాత మహీధర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘శంబాల’ కోసం టీం అంతా చాలా కష్టపడింది. యుగంధర్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. డిసెంబర్ 25న రాబోతోన్న మా సినిమాను అందరూ చూసి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత రాజశేఖర్ అన్నభిమోజు మాట్లాడుతూ .. ‘‘శంబాల’ చిత్రం చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 25న మా మూవీ రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మైత్రి నవీన్ యెర్నెని మాట్లాడుతూ .. ‘‘శంబాల’ ట్రైలర్ చాలా బాగుంది. ఆదికి కమ్ బ్యాక్ అవుతుంది. ‘శంబాల’ టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మైత్రి శశి మాట్లాడుతూ .. ‘రాజశేఖర్ గారు, మహిధర్ గారు మాకు ‘శంబాల’ సినిమా ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆల్రెడీ చూశాను. ఇంటర్వెల్ బ్లాక్ చూసి ఆశ్చర్యపోయాను. దర్శకుడు అందరినీ మెస్మరైజ్ చేశారు. చివరి వరకు ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఇది కచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అప్పుడే మీకు విజువల్‌గా, సౌండింగ్‌ను ఎంజాయ్ చేస్తారు. ఆదికి ఈ చిత్రంతో పెద్ద విజయం రానుంది. సినిమా రిలీజ్ తరువాత తండ్రిగా సాయి కుమార్ గారు ఎంతో గర్వపడతారు’ అని అన్నారు.
ఉషా పిక్చర్స్ సురేష్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ మూవీని ఆల్రెడీ చూశాను. చిత్రం అద్భుతంగా వచ్చింది. సాయి కుమార్ గారితో మాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ మూవీ పెద్ద సక్సెస్ కాబోతోంది’ అని అన్నారు.
ఆహా శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ నుంచి వస్తున్న ప్రతీ కంటెంట్ వైరల్ అయింది. ఇది చిన్న చిత్రం కాదు. పెద్ద సినిమా అవుతుంది. డిసెంబర్ 25న బ్లాక్ బస్టర్ కాబోతోంది. ఆది గారికి అద్భుతమైన విజయం దక్కబోతోంది’ అని అన్నారు.
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ .. ‘‘శంబాల’ నిర్మాతలకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. యుగంధర్‌కి సౌండింగ్ మీద మంచి పట్టుంది. ప్రవీణ్ గారి విజువల్స్ బాగుంటాయి. ఇది నా 49వ చిత్రం. ‘శంబాల’ నా కెరీర్‌లో ఎంతో స్పెషల్ మూవీ. ఆదితో ఇది వరకే కలిసి పని చేశాం. ఈ మూవీతో ఆదికి మంచి విజయం రాబోతోంది. డిసెంబర్ 25న ఈ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
అర్చనా అయ్యర్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ఎంతో మంది అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పని చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఆది గారి చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. డిసెంబర్ 25న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
డీఓపీ ప్రవీణ్ కె బంగారి మాట్లాడుతూ .. ‘‘శంబాల’ మూవీని థియేటర్లో చూస్తేనే అద్భుతమైన ఫీల్ వస్తుంది. విజువల్‌గా ఈ చిత్రం గ్రాండియర్‌గా ఉంటుంది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.
ఎడిటర్ శ్రవణ్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’కి టెక్నిషియన్‌గా కాకుండా ఓ ఆడియెన్‌లా పని చేశాను. ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ 25న ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి