అయితే వార్డు బాయ్ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తనకు డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేసినట్టు బాలిక ఆరోపించారు. అయితే అక్కడ విషం ఎక్కిస్తానని బెదిరించారు.వార్డు బాయ్ బెదిరింపులకు భయపడిపోయిన యువతి తీవ్ర మనోవేదన అనుభవించింది. అయితే ధైర్యం తెచ్చుకుని ఈ విషయాన్ని ఆమె తన సోదరుడి భార్యకు వివరించి.. కన్నీరు పెట్టుకుంది.. యువతి కుటుంబ సభ్యులు లిసారీ గేట్ పోలీస్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలిపిన తర్వాత.. ఆమె కజిన్ ఒకరు ఆస్పత్రి వద్దకు వెళ్లారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో నిందితుడు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పేషెంట్‌ను వేధిస్తున్నట్టుగా ఉంది. ఆ తర్వాత అనుమానం కలిగించే విధంగా సీసీటీవీ కెమెరాలు 40 నిమిషాల్ ఆఫ్ చేయబడ్డాయి.సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేయించి ఉంటాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.అనంతరం పోలీసులు నిందితుడిని ఖార్ఖౌడాలోని ఘోసిపూర్ గ్రామానికి చెందిన ఖాసీమ్‌గా గుర్తించారు. నిందితుడిని పోలీసులు ప్రశ్నించారు... ఈ దారుణ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి