మానవత్వం మరిచిన రాజు అనే కామాందుడు ఏకంగా ఆరేళ్ళ చిన్నారి చైత్ర ఫై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తం గా సంచలనం గా మారింది. అయితే ఇక చిన్నారి పై అత్యాచారం చేసిన నిందితునికి వెంటనే ఉరిశిక్ష విధించాలి అంటూ రాష్ట్ర ప్రజానీకం మొత్తం డిమాండ్ చేసింది. ఈ క్రమం లోనే మునుపెన్నడూ లేని విధం గా అటు తెలంగాణ పోలీసులు కూడా నిందితుడు రాజు కోసం వెతకడం ప్రారంభించారు. అంతే కాదు రాజు ఆచూకీ తెలిపిన వారికి పదిలక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.


 కేవలం పోలీసులు మాత్రమే కాదు చిన్నారిపై అత్యాచారం హత్య జరగడంతో తెలంగాణ ప్రజానీకం మొత్తం అట్టుడికిపోయింది. దీంతో రాజు కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా వెతకడం ప్రారంభించారు. ఇలాంటి సమయం లో ఆందోళన చెందిన రాజు ఏకంగా ఇటీవలే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  గట్కేసర్ సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్ ట్రాక్ పై విగత జీవిగా కనిపించాడు. అయితే చేతిపై ఉన్న మౌనిక అనే టాటూ ఆధారం గా మృత దేహం రాజుది అని పోలీసులు నిర్ధారించారు.  దీంతో అసలు మౌనిక ఎవరు అనే దానిపై ప్రస్తుతం సరికొత్త చర్చ మొదలైంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్పూర్ కు చెందిన మౌనిక అనే యువతిని రాజు మొదట పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భార్య మౌనిక ప్రస్తుతం భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే రాజు ఏకంగా మేనమామ కూతురు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  ఇక రాజు చేతి మీద ఉన్న మౌనిక టాటూ మొదటి భార్య పేరు కావడం గమనార్హం. అయితే రాజు గురించి మాట్లాడిన భార్య మౌనిక రాజు అలాంటి వాడు కాదని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: