ఇటీవలి కాలంలో భార్యాభర్తల బంధానికి అస్సలు విలువ ఉండటం లేదు. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయిన వారు మూడు నెలల ముచ్చట అన్న విధంగానే బంధాన్ని తెంచుకుంటున్న  ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తున్నాయి.అంతేకాదు ఇంకొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు.  ఏకంగా కట్టుకున్న వారి ప్రాణాలను సైతం తీస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో ప్రేమ వివాహం అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కారణంగా ఏకంగా కని పెంచిన తల్లిదండ్రులను దారుణంగా హతమారుస్తున్న ఘటన లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు ఏకంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అనుకున్న వారికి కొన్నిరోజుల్లోనే  ప్రేమించిన వారి అసలు నిజస్వరూపం బయట పడడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తున్న ఘటన లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు. ఈ క్రమంలోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


 ముందుగా అనుకున్నట్లు గానే ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక తమ జీవితం ప్రేమ పెళ్లి తర్వాత మునుపెన్నడూ లేనంత ఆనందంగా సాగిపోతుంది అని అనుకున్నారు. కానీ అంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ప్రియుడే చివరికి భార్య ప్రాణం తీసాడు. ఈ ఘటన కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో చోటు చేసుకుంది. కౌసర్ ఫిజా అనే యువతి షాయబ్ అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవలే షోయబ్ భార్య కౌసర్ ను తీసుకొని నగరానికి సమీపంలోని ఒక గ్రామం వద్ద తీసుకెళ్లి దారుణంగా చంపేస్తాడు క్షణికావేశమో లేక అనుమానమో తెలియదు కానీ చివరికి దారుణం జరిగిపోయింది. ఇటీవలే నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: