భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. కానీ నేటి రోజుల్లో భార్య భర్తల బంధం మాత్రం ఆత్మహత్యలకు హత్యలకు కేరాఫ్గా మారిపోయింది. అంతే కాదు అక్రమ సంబంధాలకు చిరునామాగా మారిపోయింది.. ఇక ఎన్నో నేరాలకు నిలయంగా మారిపోతుంది భార్య భర్తల బంధం.  నేటి రోజుల్లో భార్య భర్తల బంధం లో మాత్రం ఎక్కడ అన్యోన్యత కనిపించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మూడుముళ్ల బంధంతో ఒకటై ఏడడుగులు నడిచిన తరువాత ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సింది పోయి ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చడం లేదా చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు ఎంతోమంది.


ఇలా ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో దారుణ ఘటన వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటనజరిగింది. భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరగడం కామన్. కానీ చిన్నపాటి గొడవల ని పెద్దదిగా చేసుకుని ఏకంగా బంధానికి స్వస్తి పలుకుతున్నారు ఎంతోమంది అయితే  భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్ళడం ఇక ఆ తర్వాత అత్తారింటికి రాకపోవడంతో ఎంతో మంది భర్తలు మనస్థాపం చెంది ఏకంగా సెల్ ఫోన్ టవర్ ఎక్కి  ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించడం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు తెర మీదికి వచ్చాయి. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం ఏకంగా మనస్థాపంతో ప్రాణాలను తీసుకున్నాడు.



 భార్య కాపురానికి రాలేదని మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నాగర్ పాడు కి చెందిన  నాగ శ్రీనివాస్ అనే వ్యక్తి బతుకుదెరువుకోసం అమీన్పూర్ లోని బీరంగూడ లో ఉన్న ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు  అయితే ఇటీవలే భర్తతో గొడవపడినా భార్యకు  పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఎన్నిసార్లు కాపురానికి రావాలి అంటూ పిలిచినప్పటికీ భార్య భర్త దగ్గరికి వచ్చేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో భర్త శ్రీనివాస్ ఎంతగానో మనస్తాపం చెందాడు. ఇక ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు  గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: