ఆడవాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు.. మరొకరి బాధను చూస్తె ఏడ్పును మొదలు పెడతారు. ఇక చిన్న పిల్లల విషయం పై ప్రత్యేక శ్రద్దను చూపిస్తారు. తల్లి కాకపోయినా తల్లి స్థానంలో ఉన్న ఎవరైనా కూడా మంచిగా చూసుకోవడం వినే ఉంటారు.. కానీ ఓ తల్లి మాత్రం దత్తత తీసుకున్న చిన్నారి పై కర్కశంగా ప్రవర్తించి తల్లి పదవికే మాయని మచ్చను తీసుకొచింది.. పసి పిల్ల అని కూడా చూడకుండా హింసలకు గురి చేసింది. అది తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాధు చేయడం తో అసలు విషయం బయటకు వచ్చింది.


వివరాల్లొకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం దారుణ ఘటన వెలుగులో కి వచ్చింది. రెండేళ్ల బాలిక పై పెంపుడు తల్లి పైశాచికంగా వ్యవహరించింది. జంగారెడ్డిగూడెం లోని బాలాజీ నగర్కు చెందిన యనమదల ధర్మరాజు, లక్ష్మీ దంపతులు.. తాడేపల్లి గూడేనికి చెందిన చిన్నారి వెంకట లక్ష్మిని దత్తత తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు బాగానే చూసుకున్న తల్లి తర్వాత తన అసలు రూపాన్ని బయట పెట్టింది. చిత్ర హింసలకు గురి చేసింది. ఇంటి పనులు చేయించడం, ఒంటి పై వేడినీళ్లు పోయటం, వాతలు పెట్టింది. తర్వాత పట్టించుకోలేదు..


అయితే బాలిక ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా స్కూల్ కు వెళ్ళేది. ఆడుకుంటూ పడిపోవడం తో బాలిక ఒంటి పై కాలిన గాయాలను తోటి విద్యార్థులు గమనించి ప్రధానోపాధ్యాయిని దృష్టికి తీసుకెల్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సీడీపీవో యూఎన్‌ స్వర్ణ కుమారి, సూపర్‌ వైజర్‌ పి.బ్యూలా పాఠశాల కు వచ్చి చిన్నారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.. తల్లిని జైలు ఊసలు లెక్కబెట్టేలా చేశారు. పాపను చైల్డ్ వెల్ఫ్కేర్ కు తరలించారు. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి సరిగ్గా లేదని వైద్యులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: