
బషీరాబాద్ మండలం దామర్ చెడ్ గ్రామానికి చెందిన కార్తీక్ పెద్దముల్ మండలంలో విఆర్వో గా విధులు నిర్వహిస్తున్నాడు. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కార్తీక్ భార్యకు మాత్రం పిల్లలు పుట్టడం లేదు. ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు కార్తీక్. తాండూరుకు చెందిన ఓ యువతిని పెళ్ళి చేసుకుంటామంటు నమ్మించాడు. శారీరక వాంఛలను తీర్చుకున్నాడు. అంతలోనే కార్తీక్ మొదటిభార్యకు సంతానం కావడంతో ఇక యువతిని పెళ్లి చేసుకోను అంటూ ముఖం చాటేశాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులు కూడా పాల్పడ్డాడు. దీంతో యువతి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
దీంతో ఈ ఘటన స్థానికం గా సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి అయితే బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా ఏడుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు అని తెలుస్తుంది. అయితే ఎంతో బాధ్యతాయుతమైన ఉద్యోగంలో కొనసాగుతూ కార్తీక్ చేసిన పని తెల్సి ప్రతి ఒక్కరూ కూడా అవాక్కవుతున్నారు అనే చెప్పాలి. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేలా చూస్తాము అంటూ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.