ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే . చిన్న బడ్డీ కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ప్రతి చోట కూడా ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ లు అందుబాటులో ఉండటంతో ప్రజలు ఎవరూ కూడా నగదు లావాదేవీలు జరిగేందుకు అవకాశం ఉండడం లేదు.. అయితే కొన్నిసార్లు నగదు అవసరమైనప్పుడు మాత్రం ఏటీఎంకు వెళ్లి నగదు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు కొంత మంది వ్యక్తుల కు చేదు అనుభవం ఎదురవుతుంది.


 సాధారణంగా ఏటీఎం సెంటర్ కు వెళ్ళిన సమయంలో ఇక మనం ఏటీఎం లో కార్డు పెట్టగానే అక్కడే లాక్ అవుతుంది. అన్ని ట్రాన్సాక్షన్స్  పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు ఆన్ లాక్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. కాని కొన్ని కొన్ని సార్లు మాత్రమే ఏటీఎం లోనే కార్డు ఇరుక్కుపోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో ఏం చేయాలో తెలియక తెగ ఇబ్బందులు పడి పోతూ ఉంటారు చాలామంది. ఇలాంటి అనుభవం ఎంతో మందికి ఎదురయ్యే ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి కి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఏటీఎంకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేశాడు. కానీ డెబిట్ కార్డు మాత్రం ఏటీఎం మిషన్ లో ఇరుక్కు పోయింది.


 దీంతో కాసేపు టెన్షన్ కి గురయ్యాడు. ఎంతలా డెబిట్ కార్డు ఏటీఎం నుంచి తీసేందుకు ప్రయత్నించిన కుదరలేదు. దీంతో అతనికి చిరాకు వచ్చేసింది. తర్వాత కాసేపటికి  సదరు కస్టమర్ తర్వాత ఏం చేయాలి అలా ఆలోచించి కటింగ్ ప్లేర్ ని ఉపయోగించాడు. దాంతో ఏటీఎం మిషన్ లో ఇరుక్కున్న డెబిట్ కార్డు ని బయటకు తీసాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియోని ఇప్పటికే లక్షలాది మంది చూసేసారూ అని చెప్పారు. ఎంతో మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: